Ajay Banga: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగాను నామినేట్ చేసిన అమెరికా
- భారత సంతతి పౌరుల ప్రతిభను గుర్తిస్తున్న అమెరికా
- ఇప్పటికే అమెరికా ప్రభుత్వంలో భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు
- బంగాను వరల్డ్ బ్యాంకుకు నామినేట్ చేస్తున్నట్టు బైడెన్ ప్రకటన
అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు లభిస్తుండడం తెలిసిందే. భారతీయుల శక్తిసామర్థ్యాలకు అమెరికా ప్రభుత్వం తగిన గుర్తింపునిస్తోంది. తాజాగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగాను అమెరికా నామినేట్ చేసింది. ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి అజయ్ బంగా పేరును సూచిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
అజయ్ బంగా గతంలో మాస్టర్ కార్డ్ సీఈవోగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ప్రైవేటు ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ లో వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. వ్యాపార, ఆర్థిక రంగంలో ఆయనకు 30 ఏళ్ల విశేష అనుభవం ఉంది. మాస్టర్ కార్డ్ తో పాటు అమెరికన్ రెడ్ క్రాస్, క్రాఫ్ట్ ఫుడ్స్, డౌ ఐఎన్సీ సంస్థల్లో కీలక పదవుల్లో కొనసాగారు.