Google: గూగుల్ ఆఫీసుల్లో ఒకే డెస్క్ పై ఇద్దరు ఉద్యోగులు!

Some Google employees are asked to share desks with colleagues

  • పలు అమెరికన్ నగరాలలోని ఆఫీసుల్లో కొత్త రూల్స్
  • డెస్క్ స్పేస్ లో ఇద్దరిద్దరిని సర్దుబాటు చేస్తున్న కంపెనీ
  • ఉద్యోగులకు ఇంటర్నల్ మెమో జారీ చేసినట్లు సమాచారం

టెక్ దిగ్గజం గూగుల్ పలు ఆఫీసులను మూసేస్తోంది. అమెరికాలోని పలుచోట్ల ఉన్న కంపెనీ కార్యాలయాలను మూసేసి, ఉద్యోగులను మరోచోట సర్దుబాటు చేస్తోంది. ఇప్పటికే ఉన్న ఆఫీసులలో డెస్క్ స్పేస్ సర్దుబాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, సియాటెల్, కాలిఫోర్నియా.. తదితర నగరాల్లోని కంపెనీ ఉద్యోగులకు అంతర్గత మెమో జారీ చేసినట్లు సమాచారం. ఈమేరకు సీఎన్ బీసీ ఓ నివేదిక వెల్లడించింది.

రోజూ ఆఫీసుకు వచ్చి పనిచేసే ఉద్యోగులు ఇకపై తమ డెస్క్ స్పేస్ ను మరో ఉద్యోగితో పంచుకోవాలని గూగుల్ సూచించింది. ఒకే డెస్క్ స్పేస్ లో ఇద్దరు ఉద్యోగులు సర్దుకోవాలని ఆదేశించింది. కంపెనీ అనవసరమని భావిస్తున్న పలు ఆఫీసులను మూసేసి, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను మరోచోట సర్దుబాటు చేస్తోంది. ఇందుకోసం ఆయా ఉద్యోగులను రోజు విడిచి రోజు ఆఫీసుకు రమ్మని పిలుస్తోంది. ఈ చర్యల్లో భాగంగానే తాజాగా ఉద్యోగులకు మెమో జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అద్దె భవనాలలో నడుస్తున్న గూగుల్ కార్యాలయాల్లో కొన్నింటిని ఖాళీ చేయనున్నట్లు గూగుల్ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News