Royal Enfield: సరికొత్తగా రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ లు!

Royal Enfield Continental GT Interceptor Revealed Gets New Features Alloy Wheels

  • ఇంటర్ సెప్టార్, కాంటినెంటల్ జీటీ మోడల్స్ లో పలు మార్పులు
  • రెండింట్లో అల్లాయ్ వీల్స్ ఏర్పాటు.. కొత్త కలర్స్ కూడా
  • త్వరలోనే ఇండియన్ మార్కెట్ లోకి
  • ఇంటర్ సెప్టార్ ధర రూ.2.81 లక్షలు, కాంటినెంటల్ జీటీ ధర 3.05 లక్షలుగా ఉండే అవకాశం

‘వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డు..’ అని అమ్మాయిలు పాడేంత క్రేజ్ ఉంది రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ లకు! వింటేజ్ లుక్ తో పేరుకు తగ్గట్లే రాయల్ గా ఉంటాయవి. ఎంతో మంది యువకులకు అవి డ్రీమ్ బైక్ లు కూడా. ఇటీవల రాయల్ ఎన్ ఫీల్డ్ తమ బైక్ లకు కాస్త మోడ్రన్ లుక్ తీసుకొస్తోంది. తాజాగా ‘ఇంటర్ సెప్టార్’, ‘కాంటినెంటల్ జీటీ’ మోడల్స్ రెట్రో లుక్ మార్చకుండానే కొత్త రంగులు అద్దింది.

ఇంటర్ సెప్టార్, కాంటినెంటల్ జీటీ మోడల్స్ లో తొలిసారిగా అల్లాయ్ వీల్స్ అమర్చింది. ఇంటర్ సెప్టార్ లో బార్సిలోనా బ్లూ, బ్లాక్ రే.. కాంటినెంటల్ జీటీలో అపెక్సో గ్రే, స్లిప్ స్ట్రీమ్ బ్లూ కలర్స్ రిలీజ్ చేసింది. ట్యాంక్ ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. వీటి లుక్స్ సూపర్బ్ గా ఉన్నాయి.

అంతేకాదు.. వీటికి ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, యూఎస్ బీ చార్జింగ్ పోర్ట్ లను కూడా ఏర్పాటు చేసింది. అయితే రెండు మోడల్స్ లో 648 సీసీ, ట్విన్ ఇంజన్‌కి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌లను కంపెనీ వెల్లడించలేదు. 

త్వరలోనే ఇండియన్ మార్కెట్ లో ఈ బైక్ లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాయల్ ఎన్ ఫీల్డ్ ప్లాన్ చేస్తోంది. ఇంటర్ సెప్టార్ 650 ధర 2.81 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూమ్), కాంటినెంటల్ జీటీ ధర 3.05 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూమ్)గా ఉండొచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News