Jandhyala: జంధ్యాలగారు చనిపోయేనాటికి మా ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేదంటే ..!: ఆయన అర్థాంగి అన్నపూర్ణ

Jandhyala Annapurna Interview

  • హాస్య బ్రహ్మ అనిపించుకున్న జంధ్యాల 
  • అప్పట్లో ఆయన తీసుకున్నది తక్కువన్న అర్థాంగి
  • ఆయన అభిమానించే దర్శకులను గురించిన ప్రస్తావన 
  • ఇప్పటికీ బ్రహ్మానందం గారు కాల్ చేస్తుంటారని వెల్లడి   


తెలుగు తెరపై హాస్య కథా చిత్రాలను పరుగులు తీయించిన దర్శకుడు జంధ్యాల. హాస్య బ్రహ్మ అనిపించుకున్న ఆయన, రచయితగా .. నటుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. ఆయన అర్థాంగి అన్నపూర్ణ తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. " జంధ్యాల గారికి పిల్లలంటే చాలా ఇష్టం. కానీ పిల్లలకి నాలుగేళ్ల వయసులోనే ఆయన పోయారు. ఆ విషయమే అప్పుడప్పుడూ బాధిస్తూ ఉంటుంది" అని అన్నారు. 

"అప్పట్లో జంధ్యాల గారు చాలా సినిమాలకి పనిచేస్తూ ఉండేవారు. అయినా ఆయన తీసుకున్నది చాలా తక్కువ. ఇప్పుడంటే ఒక్క సినిమాకి రాసినవారు కూడా కోటీశ్వరులు అవుతున్నారు. అయినా జంధ్యాల గారు పోయే సమయానికి మాకు ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఏమీ లేవు. ఇప్పుడు కూడా ఉన్నదాంట్లో హ్యాపీగానే ఉన్నాము" అని చెప్పారు. 

"జంధ్యాల గారికి విశ్వనాథ్ గారన్నా, అలాగే రాఘవేంద్రరావు గారన్నా చాలా అభిమానం. వారి సినిమాలకు ఆయన ఎక్కువగా పనిచేశారు. వారు కూడా ఆయన పట్ల అదే ప్రేమను కనబరుస్తూ వచ్చారు. ఇక ఇప్పటికీ టీవీలో జంధ్యాల గారి సినిమా చూడగానే బ్రహ్మానందం గారు వెంటనే కాల్ చేస్తుంటారు" అంటూ చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News