Dr preeti: ఇప్పటికీ విషమంగానే డాక్టర్ ప్రీతి ఆరోగ్యం

NIMS Doctors released health bulletin of Medical student preethi her health condition remain serious

  • హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నిమ్స్ వైద్యులు
  • ఎక్మో, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడి
  • ప్రీతిని బతికించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు వివరణ

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) లో సీనియర్ వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసిన పీజీ విద్యార్థిని, డాక్టర్ ప్రీతి ఆరోగ్యం ఇప్పటికీ విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈమేరకు నిమ్స్ వైద్యులు డాక్టర్ ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై విడుదల చేసిన తాజా బులెటిన్ లో ఈ వివరాలు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రీతికి అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని, ఆమెను బ్రతికించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

‘ప్రస్తుతం ప్రీతికి ఎక్మో, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం. ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. మా ప్రత్యేక వైద్య బృందం ఆమెను బతికించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది’ అని నిమ్స్ వైద్యులు బులెటిన్ లో పేర్కొన్నారు. కేఎంసీలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న డాక్టర్ ఎంఏ సైఫ్ వేధింపుల వల్లే డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.

ప్రీతి కుటుంబ సభ్యుల ఆరోపణలు, మెడికల్ కాలేజీ, ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు చెబుతున్న వివరాలు భిన్నంగా ఉండడంతో సెల్ ఫోన్, వాట్సాప్ గ్రూపులలో చాటింగ్ లను పరిశీలించినట్లు తెలిపారు. వాట్సాప్ హిస్టరీ పరిశీలించాక వేధింపులకు కొన్ని ఆధారాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సైఫ్ ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News