Olive Ridley Turtles: పిల్లల్ని కనేందుకు ఒడిశా తీరానికి చేరుకుంటున్న సముద్ర తాబేళ్లు
- తీరానికి చేరుకుని గుడ్లు పెడుతున్న తాబేళ్లు
- ఏటా ఈ సీజన్ లో జరిగే కార్యక్రమం ఇది
- దీన్ని ట్విట్టర్ లో షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి నందా
రిడ్లే తాబేళ్లు ఒడిశా తీరం బాట పట్టాయి. ఈ సముద్ర తాబేళ్లు ఏటా ఈ కాలంలో ఇక్కడకు చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రాంతంలో సముద్ర తీరంలోకి చేరి ఇవి గుడ్లు పెట్టి, వాటిని కాపాడుకుంటూ పిల్లలుగా మారిన తర్వాత తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి. ఏటా కొన్ని రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పోసంపేట నుంచి బటేశ్వర్ వరకు నాలుగు కిలోమీటర్ల పరిధిలోని తీరంలో తాబేళ్లు గుడ్లు పెట్టే కార్యక్రమం గురువారం రాత్రి మొదలైంది.
ఇందుకు సంబంధించిన తాజా వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా తన ట్విట్టర్ పేజీలో పంచుకున్నారు. ఆలివ్ రిడ్లే తాబేళ్లు సముద్రం నుంచి వడివడిగా తీరంలో నడుచుకుంటూ వెళ్లడాన్ని గమనించొచ్చు. ‘‘ఏటా వచ్చే అతిథులకు ఒడిశా ఆహ్వానం పలుకుతోంది. రుషికుల్య రూకరీ వద్ద ఆలివ్ రిడ్లే తాబేళ్ల వార్షిక సామూహిక సంతానోత్పత్తి కార్యక్రమం మొదలైంది’’అని ఆయన పేర్కొన్నారు.