Indian Railways: విశాఖ నుంచి ఆ నగరాలకు వీక్లీ స్పెషల్ ట్రైన్స్..
- వేసవి సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడపనున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే
- ప్రయాణికులకు అందుబాటులోకి ఐదు స్పెషల్ ట్రైన్లు
- మిగతా రూట్లలోనూ సర్వీసులను పెంచేందుకు అధికారుల నిర్ణయం
వేసవి సందర్భంగా విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు నడపాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి, మహబూబ్‌నగర్, భువనేశ్వర్, బెంగుళూరు కంటోన్మెంట్ స్టేషన్ల మధ్య 5 వీక్లీ స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని, దానికి తగ్గట్లుగా మిగతా రూట్లలోనూ సర్వీసులను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
విశాఖ, సికింద్రాబాద్ మధ్య..
తాజా నిర్ణయంలో భాగంగా.. విశాఖపట్నం-సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ రైలు(08579) మార్చి 1 నుంచి ఏప్రిల్ 26 వరకు ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు 08.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ రైలు(08580) మార్చి 2 నుంచి ఏప్రిల్ 27 వరకు ప్రతి గురువారం రాత్రి 07.20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు 06.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
విశాఖ, మహబూబ్ నగర్ మధ్య..
విశాఖపట్నం- మహబూబ్‌నగర్ వీక్లీ స్పెషల్ రైలు(08585) మార్చి 7 నుంచి ఏప్రిల్ 25 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 05.35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మహబూబ్‌నగర్-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ రైలు(08586) మార్చి 8 నుంచి ఏప్రిల్ 26 వరకు బుధవారాల్లో 06.20 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు 09.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
విశాఖ, తిరుపతి మధ్య..
విశాఖపట్నం-తిరుపతి వీక్లీ స్పెషల్ రైలు(08583) మార్చి 6 నుంచి ఏప్రిల్ 24 వరకు సోమవారాల్లో రాత్రి 7 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 09.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి-విశాఖపట్నం వీక్లీ స్పెషల్(08584) మార్చి 7 నుంచి ఏప్రిల్ 25 వరకు మంగళవారం రాత్రి 9.55 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు 10.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
విశాఖ, బెంగుళూరు మధ్య..
విశాఖపట్నం-బెంగుళూరు కంటోన్మెంట్ వీక్లీ స్పెషల్ రైలు(08543) మార్చి 5 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆదివారం మధ్యాహ్నం 3.55 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు 09.15 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది. బెంగుళూరు కంటోన్మెంట్ – విశాఖపట్నం వీక్లీ స్పెషల్(08544 ) మార్చి 6 నుంచి మే 1 వరకు సోమవారాల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగుళూరు కంటోన్మెంట్ నుంచి బయలుదేరి మరుసటి రోజు 11.00 గంటలకు విశాఖ చేరుకుంటుంది.
భువనేశ్వర్, తిరుపతి మధ్య..
భువనేశ్వర్-తిరుపతి వీక్లీ స్పెషల్ రైలు(02809) మార్చి 4 నుంచి ఏప్రిల్ 29 వరకు శనివారాల్లో మధ్యాహ్నం 1.30 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి మరుసటి రోజు 07.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి-భువనేశ్వర్ వీక్లీ స్పెషల్(02810) మార్చి 5 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆదివారాల్లో తిరుపతి నుంచి 20.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 16.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.