Netflix: నేటి నుంచే వాల్తేరు వీరయ్య ఓటీటీలో స్ట్రీమింగ్..

valtaire veeraiah streaming from today on netflex

  • వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టించిన మెగా మూవీ
  • థియేటర్లో చూడడం కుదరని అభిమానులకు నెట్ ఫ్లిక్స్ గుడ్ న్యూస్
  • చాలాకాలం తర్వాత చిరంజీవి, రవితేజ కలిసి నటించిన సినిమా

మెగస్టార్ చిరంజీవి కొత్త సినిమా వాల్తేరు వీరయ్య ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (ఫిబ్రవరి 27) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. చిరు సినిమాను థియేటర్లో చూడడం కుదరని అభిమానులు ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన వాల్తేరు వీరయ్య మంచి విజయాన్ని అందుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. ప్రకాశ్ రాజ్, బాబీ సింహా, కేథరిన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు. అన్నయ్య మూవీ తర్వాత చిరంజీవి, రవితేజ కలిసి నటించిన ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు.

సంక్రాంతి బరిలో రెండు తెలుగు సినిమాలతో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమాలు రెండు థియేటర్లలో విడుదలయ్యాయి. అందులో ఓవరాల్ గా దాదాపు రూ.250 కోట్ల వసూళ్లతో వాల్తేరు వీరయ్య ముందంజలో నిలిచింది. ఓవర్సీస్‌లోనూ వాల్తేరు వీరయ్య సినిమా 2.5 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఓవర్సీస్ వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్‌.. సోమవారం (ఫిబ్రవరి 27) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తోంది.

  • Loading...

More Telugu News