Sensex: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- ఉదయం నుంచి సాయంత్రం వరకు నష్టాల్లోనే కొనసాగిన మార్కెట్లు
- 175 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 73 పాయింట్లు పతనమైన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. ఉదయం నష్టాలతో ట్రేడింగ్ ను ప్రారంభించిన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 175 పాయింట్లు కోల్పోయి 59,288కి పడిపోయింది. నిఫ్టీ 73 పాయింట్లు నష్టపోయి 17,392 వద్ద స్థిరపడింది. ఐటీ స్టాకులు నష్టపోవడం ఈనాటి మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.02%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.99%), కొటక్ బ్యాంక్ (1.82%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.34%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.83%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-3.37%), ఇన్ఫోసిస్ (-2.71%), టీసీఎస్ (-2.01%), టాటా మోటార్స్ (-1.99%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.22%).