Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం: మనీశ్ సిసోడియాకు మార్చి 4 వరకు కస్టడీ

Court allows CBI custody for Manish Sisodia

  • మనీశ్ సిసోడియాను నిన్న అరెస్ట్ చేసిన సీబీఐ
  • నేడు కోర్టులో హాజరు
  • సీబీఐ కస్టడీకి అనుమతించిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు
  • సిసోడియాను మరోసారి ప్రశ్నించనున్న సీబీఐ

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడం తెలిసిందే. కాగా, ఆయనను ఇవాళ సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు మనీశ్ సిసోడియాకు మార్చి 4 వరకు సీబీఐ కస్టడీకి అనుమతించింది. దాంతో, ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియాను సీబీఐ మరోసారి ప్రశ్నించనుంది. 

న్యాయస్థానంలో సిసోడియా తరఫు న్యాయవాది దయన్ కృష్ణన్ వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేసిందని తెలిపారు. సీబీఐ పలుమార్లు చేసిన సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదని వివరించారు. 

న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా సిసోడియా అరెస్ట్ జరిగిందని అన్నారు. సిసోడియాను కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు. ఇదే కేసులో విజయ్ నాయర్ ఇప్పటికే బెయిల్ పొందారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

సిసోడియాకు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాలను సీబీఐకి అప్పగించడం జరిగిందని న్యాయవాది దయన్ కృష్ణన్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News