KCR: సిసోడియా అరెస్ట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందన

CM KCR responds on Sisodia arrest in Delhi Liquor Scam case

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియా అరెస్ట్
  • నేడు కోర్టులో హాజరు
  • మార్చి 4 వరకు రిమాండ్
  • సిసోడియా అరెస్ట్ ను ఖండించిన సీఎం కేసీఆర్

లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. అదానీకి, ప్రధాని మోదీకి మధ్య ఉన్న అనుబంధం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసిన పని అని ఆరోపించారు. 

మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు నేడు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఐదు రోజుల కస్టడీ విధించింది. 

సిసోడియా అనేక మొబైల్ ఫోన్ల ద్వారా లిక్కర్ స్కాం నిందితులతో మాట్లాడారని, సాక్ష్యాలు లేకుండా చేశారని ఇవాళ వాదనల సందర్భంగా సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. లిక్కర్ విధానంలో కమీషన్ ను 5 శాతం నుంచి 12 శాతానికి పెంచారని, లిక్కర్ విధానంలో చివరి నిమిషంలో మార్పు ద్వారా లైసెన్స్ పొందినవారికి ప్రయోజనం చేకూర్చారని సిసోడియాపై ఆరోపణలు చేశారు.
             
సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుమార్తె కవితపైనా తీవ్ర ఆరోపణలు ఉండడం తెలిపిందే.

  • Loading...

More Telugu News