IT Raids: హైదరాబాదులో రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు
- రియల్ ఎస్టేట్ సంస్థలే లక్ష్యంగా ఐటీ అధికారుల సోదాలు
- నగరంలో 20 చోట్ల సోదాలు
- వ్యాపార లావాదేవీలు, చెల్లిస్తున్న ఆదాయపన్ను మధ్య వ్యత్యాసం!
హైదరాబాదులో మరోసారి ఆదాయ పన్ను శాఖ దాడుల కలకలం రేగింది. నగరంలోని పలు రియల్ ఎస్టేట్ సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఐటీ అధికారులు నేడు దాడులు నిర్వహించారు. గూగి గ్లోబల్ ప్రాజెక్ట్ లిమిటెడ్, గూగి ఫౌండేషన్, విహంగ చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, మెరిడియన్ డేటా ల్యాబ్స్ లిమిటెడ్, వండర్ సిటీ, ఇన్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్, హ్యాపీ హార్స్ ఎంటర్ ప్రైజెస్, రాయల్ సిటీ, ఫార్మా సిటీ తదితర సంస్థల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.
గూగి కంపెనీ అధినేత యాసిన్ ఫాతిమా ఇళ్లు, ఆఫీసుల్లోనూ ఐటీ సోదాలు జరిగాయి. నగరంలో 20 చోట్ల ఏకకాలంలో దాడులు జరిగినట్టు తెలుస్తోంది. వ్యాపార లావాదేవీలు, ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లింపులకు మధ్య వ్యత్యాసం ఉన్నందునే ఈ దాడులు చేపట్టినట్టు సమాచారం. హైదరాబాదులో గత నెలలోనూ రియల్ ఎస్టేట్ కంపెనీలపై దాడులు జరిగాయి.