Priyadarshi: ఇది మన గుండెకాయలాంటి సినిమా: 'బలగం' ఈవెంటులో దిల్ రాజు

Balagam Pre Release Event
  • తెలంగాణ నేపథ్యంలో నడిచే కథగా 'బలగం'
  • దిల్ రాజు బ్యానర్లో రూపొందిన సినిమా  
  • తమ సంస్థ నుంచి వస్తున్న మరో మంచి చిత్రమన్న దిల్ రాజు 
  • తాను పరిచయం చేస్తున్న పదో దర్శకుడు వేణు అని వెల్లడి
కమెడియన్ గా వేణు పలు చిత్రాలలో నటించాడు. ఆయన దర్శకుడిగా చేసిన తొలి ప్రయత్నమే 'బలగం' సినిమా. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మితమైన ఈ సినిమా, మార్చి 3వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో 'సిరిసిల్ల'లో అభిమానుల సమక్షంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. 

ఈ వేదికపై దిల్ రాజు మాట్లాడుతూ .. "ముందుగా కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిరిసిల్లలో ఈ సినిమా షూటింగు జరగడానికి అంతా కూడా ఎంతో సహకరించారు. తెలంగాణ నేపథ్యంలో గతంలో వచ్చిన 'ఒసేయ్ రాములమ్మా' .. 'ఫిదా' వంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అలాగే ఈ సినిమాకి కూడా ఆ స్థాయి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నాను" అన్నారు.

' ఇది సిరిసిల్లలోని ఒక కుటుంబం చుట్టూ తిరిగే కథ. మా సంస్థ నుంచి పరిచయమవుతున్న పదో దర్శకుడు వేణు. ఈ సినిమాను తాను చాలా అద్భుతంగా ఆవిష్కరించాడు. 'బొమ్మరిల్లు' .. శతమానం భవతి' మాదిరిగా మా సంస్థకి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మన గుండెకాయ లాంటి సినిమా" అంటూ చెప్పుకొచ్చారు. 

Priyadarshi
Kavya
Venu
Balagam Movie

More Telugu News