Tripura: ప్రారంభమైన మూడు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు.. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?

Vote counting starts in Tripura Meghalaya and Nagaland

  • త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఇటీవల ఎన్నికలు
  • ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
  • త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ కూటమిదే గెలుపన్న ఎగ్జిట్ పోల్స్

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌‌ లలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. త్రిపురలో 60, మేఘాలయలో 60, నాగాలాండ్‌లో 60 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

త్రిపుర, నాగాలాండ్‌ లలో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మేఘాలయలో మాత్రం కన్రాడ్ సంగ్మా సారథ్యంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అధికారాన్ని చేజిక్కించుకుంటుందని పేర్కొన్నాయి. మధ్యాహ్నానికి గెలుపోటములపై స్పష్టత రానుంది.

  • Loading...

More Telugu News