world economic forum: అప్పుడు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్లకుండా.. ఇప్పుడు హడావుడి ఎందుకు?: గంటా శ్రీనివాసరావు విమర్శలు

Ganta_Srinivasa rao Questions AP Govt

  • రాజధానినే నిర్మించుకోలేని రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఎలాంటి నమ్మకాన్ని కలిగిస్తారన్న గంటా 
  • ఉద్యోగులకు సకాలంలో జీతాలే ఇవ్వలేని ప్రభుత్వాలను నమ్మి పెట్టుబడులు ఎలా వస్తాయని నిలదీత 
  • ట్విట్టర్ వేదికగా 20 ప్రశ్నలు సంధించిన మాజీ మంత్రి

ఒక రాజధానినే నిర్మించుకోలేని రాష్ట్రంలో.. పెట్టుబడిదారులకు ఎలాంటి నమ్మకాన్ని కలిగించగలమంటూ వైసీపీ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తల్లో ఎలాంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయకుండానే పెట్టుబడుల సదస్సు పెట్టేంత సాహసం చేయడం వెనుక సర్కారు కాన్ఫిడెన్స్‌ను ఎలా అర్థం చేసుకోవాలని నిలదీశారు. ప్రపంచ పెట్టుబడుల సమావేశానికి ముందు సర్కారు తీరును ఆయన ఎండగట్టారు. ఈరోజు ట్వీట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. 

వైసీపీ సర్కారుకు గంటా శ్రీనివాసరావు ప్రశ్నలు

  • పెట్టుబడుల స్వర్గధామమైన దావోస్ లో ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ కు వెళ్లకపోవడానికి సరైన కారణాలు ఏంటి? దానివల్ల రాష్ట్ర ప్రతిష్ట ఎంత దెబ్బతిందో కనీసం ఇప్పటికైనా గుర్తించారా?
  • ఒక రాజధానినే నిర్మించుకోలేని రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఎలాంటి నమ్మకాన్ని కలిగించగలం?
  • జాకీ అనే అండర్ వేర్ కంపెనీ రాష్ట్రంలో ఉండలేమని పారిపోతుంటే ఏమి చేశారు? కారణాలను విశ్లేషించి తప్పులను సరిదిద్దుకుని, అలాంటివి పునరావృతం కావన్న భరోసా ఇచ్చారా?
  • కియా కంపెనీకి అనుబంధ కంపెనీలు ఒక్కటీ తీసుకురాలేకపోయినందుకు ఆత్మ సమీక్ష చేసుకున్నారా?
  • హెచ్ఎస్‌బీసీ ఇక్కడ నుంచి వెళ్లకుండా ఆపే ప్రయత్నం కనీసం చేశారా?
  • లులూని ఇక్కడ నుంచి తరిమేశామని ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చెబుతారా?
  • అమర్‌రాజా బ్యాటరీస్ ను విజయవంతంగా రాష్ట్రం నుంచి వెళ్లగొట్టామని సమ్మిట్‌లో గొంతెత్తి చెబుతారా?
  • భోగాపురం ఎయిర్ పోర్ట్‌ను నాలుగేళ్లు శంకుస్థాపన చేయకుండా వదిలేసి ఇప్పుడు ఎందుకు హడావుడి చేస్తున్నారు?
  • ఈ సమ్మిట్ కే 25 చార్టర్డ్ ఫ్లైట్స్ వస్తుంటే ప్రస్తుత ఎయిర్ పోర్టులో18 కి మాత్రమే పార్కింగ్ చేసే సౌకర్యం ఉందని ఎలా చెబుతున్నారు? అదే భోగాపురం ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించుకుని ఉంటే ఈ సమస్య ఉండేదా?
  • నాలుగేళ్లలో రాష్ట్రంలో అప్పటికే ఉన్న పోర్ట్‌లు తప్ప కొత్తగా ఒక్క పోర్ట్‌ను అయినా అభివృద్ధి చేశారా?
  • అసలు మీరు పారిశ్రామిక వేత్తలలో ఎలాంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయకుండా పెట్టుబడుల సదస్సు పెట్టేంత సాహసం చేయడం వెనుక మీ కాన్ఫిడెన్స్‌ను ఎలా అర్ధం చేసుకోవాలి?
  • రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి పెట్టుబడులను ఆహ్వానించగలమా?
  • 2019లో విశాఖలో దాదాపు యాభైవేల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటే ఇప్పుడు 2- 3 వేల మందికి ఎందుకు తగ్గిపోయారు?
  • మీ ప్రభుత్వం వచ్చాక ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఒక్క కంపెనీకి ఒక్క రూపాయి అయినా ఇచ్చారా?
  • ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి ఫిన్ కార్ప్ కంపెనీలు ఎందుకు ఇక్కడ నుంచి పారిపోయాయి?
  • అదానీ డేటా సెంటర్‌కు గతంలోనే శంకుస్థాపన జరిగింది.. కానీ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. అయినా మళ్లీ అదనంగా భూమి కేటాయించడం వెనుక రహస్యం ఏంటి?
  • ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ప్రతీ నెలా మొదటి తేదీ నుంచి చివరి తేదీ దాకా ఎందుకు తీసుకుంటున్నారు?
  • తన ఉద్యోగులకు సకాలంలో జీతాలే ఇవ్వలేని ప్రభుత్వాలను నమ్మి పెట్టుబడులు ఎలా వస్తాయో చెప్పగలరా?
  • సరైన ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో సగటు పౌరుడి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందన్న వాస్తవాన్ని అంగీకరిస్తారా?
  • చిట్టచివరిగా మీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయ్యాక, ఎన్నికలకు ఏడాది ముందు పెట్టుబడుల సదస్సు పేరుతో ఈ హడావుడి వెనుక కారణాలేంటి?
‘‘ఈ ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో చేసినవి ఎంత మాత్రం కావని... మన రాష్ట్రంలో సగటు పౌరుని సందేహాలని... సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను’’ అని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News