Deepika Padukone: 'పఠాన్' సినిమా వివాదాలు నన్ను కదిలించలేకపోవడానికి కారణం ఇదే: దీపికా పదుకుణే

This is the reason why I was not disturbed with Pathaan controversy says Deepika Padukone
  • తాను క్రీడాకారుల కుటుంబం నుంచి వచ్చానన్న దీపిక 
  • సంక్షోభ సమయంలో దృఢంగా ఎలా ఉండాలో క్రీడలు నేర్పిస్తాయని వ్యాఖ్య 
  • ఇక్కడ రాణించాలంటే కష్టాలను ఎలా ఓర్చుకోవాలో నేర్చుకున్నామని వెల్లడి  
షారుఖ్ ఖాన్, దీపికా పదుకుణే కాంబినేషన్లో వచ్చిన 'పఠాన్' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రూ. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మరోవైపు ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీపిక అందాలు ఆరబోసిన బేషరమ్ పాట వివాదానికి కారణమయింది. 

ఈ వివాదంపై తాజాగా దీపిక స్పందిస్తూ... తాను క్రీడాకారుల కుటుంబం నుంచి వచ్చానని... కాలేజీ రోజుల వరకు కూడా తాను ఎన్నో క్రీడల్లో భాగస్వామిని అయ్యానని తెలిపింది. సంక్షోభాలను కూడా దృఢంగా ఎలా ఎదుర్కోవాలో క్రీడలు నేర్పిస్తాయని... అందుకే, పఠాన్ వివాదాలు కూడా తనను కదిలించలేకపోయాయని చెప్పింది. 

తాను, షారుఖ్ ఇద్దరూ సాధారణ మధ్య తరగతి కుటుంబాల నుంచి ఎన్నో కలలతో చిత్ర సీమలోకి అడుగుపెట్టామని... ఈ రంగంలో రాణించాలంటే కష్టాలను ఎలా ఓర్చుకోవాలో, అవమానాలను ఎలా భరించాలో నేర్చుకున్నామని తెలిపింది. పఠాన్ సినిమా వివాదం సమయంలో కూడా తాము ఎంతో పరిణితితో వ్యవహరించామని చెప్పింది.
Deepika Padukone
Shahrukh Khan
Pathaan

More Telugu News