Hardik Pandya: టెస్ట్ జట్టులో పాండ్యా ఎందుకు లేడో అర్థం కావడం లేదు: ఇయాన్ చాపెల్

Dont understand why Hardik Pandya isnot in the Indian Test team says Ian Chappell

  • అతడో మంచి బ్యాట్స్ మ్యాన్, బౌలర్, ఫీల్డర్ అన్న చాపెల్
  • ఆడాలనుకుంటున్నప్పుడు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం
  • జట్టుకు మంచి సమతూకం తీసుకొస్తాడన్న ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్

ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాను టెస్ట్ జట్టులోకి ఎందుకు ఎంపిక చేయలేదో తనకు అర్థం కావడం లేదన్నారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ ఇండోర్ లో జరగ్గా, ఆస్ట్రేలియా విజయం సాధించడం తెలిసిందే. పాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్ పలు కారణాలతో ఇండోర్ టెస్ట్ కు అందుబాటులో లేకుండా స్వదేశానికి వెళ్లిపోయారు. దీంతో కామెరాన్ గ్రీన్ కు అవకాశం లభించింది. జట్టులో సమతూకం వచ్చి ఆస్ట్రేలియా విజయం సాధించడం సెలక్టర్లను పునరాలోచనలో పడేసింది. 

భారత్ ఓటమి చెందడంతో ఇయాన్ చాపెల్ స్పందిస్తూ.. ‘‘29 ఏళ్ల క్రికెటర్ భారత్ కోసం టెస్ట్ మ్యాచుల్లో ఆడాలని అనుకుంటున్నప్పుడు, అతడికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలి. అతడు భారత జట్టుకు మంచి సమతూకాన్ని తీసుకొస్తాడు. అతను అంతగా బౌలింగ్ చేయలేడని కొందరు నాతో అంటూ ఉంటారు. మీరు వైద్యులు చెప్పేది వింటున్నారా? లేక క్రికెటర్లతో ముచ్చటించారా? అని అడుగుతున్నాను. పాండ్యా ఆడాలనుకుంటున్నప్పుడు అతడు భారత జట్టులో ఉండాల్సిందే. అతడో మంచి బ్యాట్స్ మ్యాన్. బాగా బౌలింగ్ చేయగలడు. మంచి ఫీల్డర్ కూడా’’ అని ఈఎస్ పీఎన్ క్రిక్ ఇన్ఫోతో చాపెల్ చెప్పారు. 2018 నుంచి టెస్టుల్లో పాండ్యాకు అవకాశం రావడం లేదన్న విషయం గమనార్హం.

  • Loading...

More Telugu News