Chandrababu: రాష్ట్రంలో అన్నీ దివాలా తీసినా కోర్టులు మాత్రం కళకళలాడుతున్నాయి: చంద్రబాబు

Chandrababu speech in TDP Legal Cell meeting

  • మంగళగిరిలో టీడీపీ లీగల్ సెల్ రాష్ట్రస్థాయి సమావేశం
  • హాజరైన చంద్రబాబు
  • రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్న చంద్రబాబు
  • నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని వెల్లడి

మంగళగిరిలో జరిగిన టీడీపీ లీగల్ సెల్ రాష్ట్రస్థాయి సదస్సులో పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. టీడీపీలో అప్పట్లోనే 47 మంది అడ్వొకేట్లు ఉండేవారని వెల్లడించారు. యనమల, బాలయోగి, యర్రన్నాయుడు, ఆలపాటి, నక్కా ఆనంద్ బాబు వంటి అడ్వొకేట్లను అప్పట్లోనే ఎంపిక చేశామని చెప్పారు. 

ఇటీవలి వరకు టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ అడ్వొకేట్ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభకు కూడా వెళ్లారని చంద్రబాబు వివరించారు. 

"నేను 1978లో తొలిసారి ఎమ్మెల్యేను అయ్యాను. ఇప్పటివరకు 45 ఏళ్లు గడిచాయి. అయితే ఎంతోమంది ముఖ్యమంత్రులుగా వచ్చినా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. టీడీపీ అధికారం చూసింది, ప్రతిపక్షంలోనూ ఉంది. కానీ ఇంత నీచమైన రాజకీయాలను మాత్రం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడే మొట్టమొదటిసారి చూస్తున్నాను. 

ఈ ప్రభుత్వంలో అందరూ దివాలా తీశారు కానీ, కోర్టులు మాత్రం కళకళలాడుతున్నాయి... అడ్వొకేట్లు మాత్రం బాగున్నారు. అందుకు కారణం వీళ్లు చేసే అరాచకాలు... అరాచకాలు పెరుగుతూ ఉంటే ప్రజలు ఎక్కడికి వెళతారు... నేరుగా కోర్టుల దగ్గరకో, లేక అడ్వొకేట్ల దగ్గరకో రావాలి. ఇవాళ జరుగుతోంది అదే. కొన్నిరోజులు పోతే అడ్వొకేట్లకు డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. ఇంత విధ్వంసం చేసిన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. భవిష్యత్ ను అంధకారం చేసే పనిలో ఉన్నారు" అని విమర్శించారు.

  • Loading...

More Telugu News