TRS: తెలంగాణలో టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ...?

Is there new party with TRS name
  • ఇటీవల బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ పార్టీ
  • తెరమరుగైన టీఆర్ఎస్ పేరు
  • అయితే టీఆర్ఎస్ పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ అంటూ ప్రచారం
ఇటీవల టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన సంగతి తెలిసిందే. అంతటితో టీఆర్ఎస్ అనే పేరు తెరమరుగైనట్టేనని అందరూ భావించారు. అయితే, తెలంగాణలో టీఆర్ఎస్ పేరుతో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) లేదా తెలంగాణ రైతు సమితి/సమాఖ్య (టీఆర్ఎస్) పేరుతో పార్టీని రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ఈ కొత్త టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలోని కొందరు కీలకనేతలు సారథ్యం వహించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొందరు అసంతృప్త నేతలు ఈ పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
TRS
New Party
BRS
Telangana

More Telugu News