Stock Market: 60 వేల ఎగువకు సెన్సెక్స్.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
- సోమవారం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
- అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు
- సెన్సెక్స్ 60334 వద్ద, నిఫ్టీ 17740 వద్ద ట్రేడింగ్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 సమయంలో సెన్సెక్స్ 525 పాయింట్లు పుంజుకుని 60,334 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ కూడా 146 పాయింట్ల లాభంతో 17740 మార్కు వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.79గా ఉంది. సెన్సెక్స్30 సూచీలోని టీసీఎస్, హెచ్డీఎఫ్సీ, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల బాటలో నడుస్తున్నాయి. టాటా స్టీల్ షేర్లు మాత్రం నష్టాలను చవిచూస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు దేశీయ సూచీలు లాభాల బాట పట్టేందుకు దోహదపడ్డాయి.
అంతర్జాతీయ మార్కెట్లలోనూ సానుకూల పవనాలు వీస్తున్నాయి. గత వారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇక ఆసియా-పసిఫిక్ సూచీలు కూడా లాభాల కళ్లచూస్తున్నాయి. మరోవైపు.. రిటైల్ పెట్టుబడిదారులు స్టాక్‌మార్కెట్ మళ్లీ పెట్టుబడులతో హల్చల్ చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, అశోకా బిల్డ్‌కాన్, మహానగర్ గ్యాస్ లిమిటెడ్, ఎక్సైజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఈజీట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్ సంస్థల షేర్ల కదలికలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని స్కాట్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.