Anand Mahindra: క్యారెట్ ను సంగీత పరికరంగా మార్చి పాండిత్య ప్రదర్శన..: ఆనంద్ మహీంద్రా వీడియో

Anand Mahindra shares video of Australian musician who turned a carrot into a clarinet

  • ఆస్ట్రేలియా సంగీతకారుడి ప్రతిభ
  • దీన్ని పరిచయం చేసిన ఆనంద్ మహీంద్రా
  • చుట్టూ ఉన్న ప్రతిదానిలో సంతోషాన్ని గుర్తించొచ్చంటూ ట్వీట్

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరో సరికొత్త, వినూత్న వీడియోతో నెటిజన్ల ముందుకు వచ్చారు. ఆస్ట్రేలియా సంగీత కళాకారుడు ఓ క్యారెట్ ను క్లారినెట్ గా మార్చేశారు. దానిపై సంగీతాన్ని అద్భుతంగా పలికించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రతి ఒక్కదానిలోనూ సంగీతాన్ని గుర్తించాలంటూ ఆనంద్ మహీంద్రా పిలుపునివ్వడం గమనించాలి.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో రెండు నిమిషాల నిడివితో ఉంది. ‘‘దీన్నుంచి నేను పొందిన సందేశం ఏమిటంటే.? మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కదానిలోనూ సంగీతాన్ని గుర్తించొచ్చు అని’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దీన్ని ఇప్పటికే 5 లక్షల మంది చూశారు. క్యారెట్ ను డ్రిల్ మెషిన్ సాయంతో క్లారినెట్ గా మార్చడాన్ని గమనించొచ్చు. ఒక యూజర్ అయితే ఆనంద్ మహీంద్రాను ఉద్దేశిస్తూ.. ‘‘మీ చుట్టూ ఉన్న వాటిలో సంగీతాన్ని గుర్తించొచ్చు. అలాగే, మీరు చేసే ప్రతి ఒక్కదానిలోనూ సంతోషాన్ని గుర్తించొచ్చు’’ అని పేర్కొనడం గమనార్హం. 

  • Loading...

More Telugu News