CPI Narayana: జనాల్లో మార్పు కనిపిస్తోంది.... జగన్ ఏం చేసినా ఓట్లు పడవు: సీపీఐ నారాయణ

CPI Narayana comments on AP politics

  • ఏపీలో అభివృద్ధి ఎక్కడుందో చెప్పాలన్న నారాయణ
  • జగన్ బటన్ నొక్కడం వల్ల ప్రయోజనంలేదని వ్యాఖ్య 
  • రాక్షస పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారన్న సీపీఐ నేత 

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేశ్ పర్యటనలను ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. లోకేశ్ ను చూస్తే సీఎం జగన్ కు భయమెందుకని అన్నారు. జగన్ కు భయంలేకపోతే ప్రతిపక్షాల గొంతు ఎందుకు నొక్కుతున్నారని నిలదీశారు. 175 సీట్లు వస్తాయని జగన్ కు నిజంగా నమ్మకం ఉంటే పోలీసులను అడ్డంపెట్టుకుని తిరగాల్సిన అవసరం ఏంటని నారాయణ ప్రశ్నించారు.  

జగన్ రాక్షస పాలనకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. జగన్ బటన్ నొక్కడం వల్ల ప్రయోజనంలేదని, ఏపీలో అభివృద్ధి ఎక్కడ ఉందో జగన్ చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో జనాల్లో మార్పు కనిపిస్తోందని, జగన్ ఏంచేసినా ఓట్లు పడవని నారాయణ అభిప్రాయపడ్డారు. 

ఏపీకి రూ.13 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు వచ్చాయనడం కాకి లెక్కలు మాత్రమేనని విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితులు మారేవరకు కొత్త పరిశ్రమలు రాలేవని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News