Delhi Capitals: వర్షం ఆగింది... ఆ తర్వాత పరుగుల వర్షం కురిసింది!
- డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ యూపీ వారియర్స్
- మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ
- 9 ఓవర్ల వద్ద వర్షం... అప్పటికి స్కోరు 87/1
- మళ్లీ మొదలైన ఆట
- 20 ఓవర్లలో 4 వికెట్లకు 211 రన్స్ చేసిన ఢిల్లీ
డబ్ల్యూపీఎల్ లో భాగంగా యూపీ వారియర్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ బ్యాటింగ్ సమయంలో 9 ఓవర్ల వద్ద వర్షం అంతరాయం కలిగించగా, అప్పటికి స్కోరు 1 వికెట్ నష్టానికి 87 పరుగులు. వర్షం ఆగిన తర్వాత ఆట ఆరంభం కాగా, ఢిల్లీ అమ్మాయిలు పరుగుల వర్షం కురిపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేశారు.
కెప్టెన్ మెగ్ లానింగ్ 42 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేయగా..... చివర్లో జెస్ జొనాస్సెన్ 20 బంతుల్లో 42 పరుగులతో అజేయంగా నిలిచింది. జొనాస్సెన్ భారీ షాట్లతో విరుచుకుపడడంతో ఢిల్లీ స్కోరు 200 దాటింది. ఆమె స్కోరులో 3 ఫోర్లు, 3 సిక్సులున్నాయి.
ఆలిస్ కాప్సే 10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 21, జెమీమా రోడ్రిగ్స్ 22 బంతుల్లో 34 పరుగులు చేశారు. యూపీ వారియర్స్ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, రాజేశ్వరి గైక్వాడ్ 1, తహ్లియా మెక్ గ్రాత్ 1, సోఫీ ఎక్సెల్ స్టోన్ 1 వికెట్ తీశారు.