Prakash Raj: 'రంగ మార్తాండ' కోసం చివరి రోజుల్లో సిరివెన్నెల రాసిన పాట!
- కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన 'రంగ మార్తాండ'
- ఓ రంగస్థల నటుడి చుట్టూ తిరిగే కథ
- కథను నడిపించే సిరివెన్నెల పాట హైలైట్
- ఇళయరాజా ఆలపించిన పాట
కృష్ణవంశీ దర్శకత్వంలో 'రంగ మార్తాండ' రూపొందింది. ఇది ఒక రంగస్థల నటుడి చుట్టూ తిరిగే కథ. ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. బ్రహ్మానందం ప్రధానమైన పాత్రలను పోషించారు. కాలెపు మధు - వెంకట్ రెడ్డి కలిసి నిర్మించిన ఈ సినిమాకి, ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు.
కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి 'పువ్వై విరిసే ప్రాణం .. పండై మురిసే ప్రాయం' అనే పాటలోని కొంతభాగాన్ని రిలీజ్ చేశారు. తన చివరి రోజులలో సిరివెన్నెల రాసిన పాట ఇది. ఈ పాటను ఇళయరాజానే ఆలపించారు. ఆ పాటను ఇప్పుడు పూర్తి స్థాయిలో వదిలారు. ఈ సినిమాలోని ఒక పాత్ర అనుభవంగా కాకుండా, ప్రతి మనిషి జీవితంలోకి ఈ పాట తొంగి చూస్తుంది.
నటుడేగా నరుడన్నవాడు .. అభినయమే తప్ప అనుభవం ఏది? .. ఓ వేషధారి .. నీ సూత్రధారి ఎవరో తెలుసుకో .. నీ గుండెను వదిలిపెట్టి వెళ్లిపోయే ఊపిరి నీదెలా అవుతుంది? నీ యుద్ధం నీలో ఉండి నిన్నోడించింది" అనే పంక్తులు మనసులను కదిలించి వేస్తాయి. ఇది ఒక పాటగానే కాదు .. జీవితసత్యాలను ఏరి కట్టిన మూటలా అనిపిస్తుంది.