Nara Lokesh: లోకేశ్ నేటి పాదయాత్ర షెడ్యూల్ ఇదిగో!
- మదనపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్ర
- పూలవాండ్లపల్లి క్యాంప్ సైట్ నుంచి యాత్ర ప్రారంభం
- లోకేశ్ కు ఆశీర్వచనం ఇవ్వనున్న టీడీపీ సీనియర్ నేతలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 39వ రోజుకు చేరుకుంది. మదనపల్లి నియోజకవర్గం పూలవాండ్లపల్లి క్యాంప్ సైట్ నుంచి ఈనాటి పాదయాత్ర ప్రారంభమయింది. ఉదయం ఆయన బోయ సామాజికవర్గీయులతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఎనుములవారిపల్లిలో భోజన విరామం ఉంటుంది. ఇప్పటి వరకు లోకేశ్ పాదయాత్ర 497.5 కిలోమీటర్లు కొనసాగింది.
లోకేశ్ 39వ రోజు పాదయాత్ర షెడ్యూల్:
8.00 – పూలవాండ్లపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.10 – పూలవాండ్లపల్లిలో బోయ సామాజికవర్గీయులతో భేటీ.
8.40 – మదనపల్లి రూరల్ సీటీఎం-1 పంచాయతీలతో స్థానికులతో మాటామంతీ.
8.55 – సీటీఎం-1 క్రాస్ రోడ్డులో స్థానికులతో భేటీ.
9.15 – సీటీఎం-2 పంచాయితీలో పాదయాత్ర 500 కిలోమీటర్లకు చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.
9.40 – యువనేతకు పార్టీ సీనియర్ నేతల ఆశీర్వచనం.
10.20 – సీటీఎం లేక్ వద్ద స్థానికులతో సమావేశం.
11.00 – కొత్తవారిపల్లి వద్ద స్థానికులతో మాటామంతీ.
11.40 – ఎనుమువారిపల్లిలో చేనేతలతో సమావేశం.
12.40 – ఎనుమువారిపల్లిలో భోజన విరామం.
1.40 – ఎనుమువారిపల్లి భోజన విరామ స్థలంలో ముస్లింలతో ముఖాముఖి.
3.40 – మెడికల్ కళాశాల నిర్మాణ ప్రాంతంలో యువతతో భేటీ.
4.20 – తురకపల్లిలో స్థానికులతో సమావేశం.
4.45 – వెంకటప్పకొండలో టిడ్కో గృహాల బాధిత లబ్ధిదారులతో భేటీ.
5.25 – తట్టివారిపల్లి వెంగమాంబ సర్కిల్ లో స్థానికులతో మాటామంతీ.
6.20 – తట్టివారిపల్లి దేవతానగర్ లో పార్టీలో చేరికలు.
6.30 - తట్టివారిపల్లి దేవతానగర్ విడిది కేంద్రంలో బస.