Virat Kohli: మరో రికార్డుకు 42 పరుగుల దూరంలో విరాట్ కోహ్లీ

Virat Kohli 42 runs away from going past Sunil Gavaskar Rahul Dravid in illustrious list led by Sehwag Tendulkar

  • 4,000 పరుగుల మైలురాయికి చేరువ అయిన కోహ్లీ
  • ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ లో సత్తా చూపిస్తే రికార్డ్ సొంతం
  • ఇప్పటి వరకు ఈ రికార్డు నమోదు చేసింది నలుగురే

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి గడిచిన మూడేళ్ల కాలంలో గొప్ప ప్రదర్శన కనిపించలేదు. అయినా, అతడు ఇప్పటికీ ఎన్నో రికార్డులు నమోదు చేస్తూనే ఉన్నాడు. కెరీర్ ఆరంభం నుంచి అతడు చూపించిన ప్రతిభే ఈ రికార్డులకు మూలం అని చెప్పుకోవాలి. కోహ్లీ మరో 42 పరుగులు సాధిస్తే.. టెస్టుల్లో 4,000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి మాజీ క్రికెటర్ల రికార్డులను దాటుకుని ముందుకు వెళ్లనున్నాడు.

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నేటి నుంచి నాలుగో టెస్ట్ జరుగుతుండడం తెలిసిందే. ఇందులో విరాట్ కోహ్లీ 42 పరుగులు సాధించగలిగితే 4,000 పరుగుల రికార్డ్ అతడి ఖాతాలో పడుతుంది. ఈ మైలురాయిని చేరుకున్న ఐదో భారత బ్యాట్స్ మ్యాన్ గా కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కుతాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ కే ఇది సాధ్యమైంది. 

సునీల్ గవాస్కర్ 4,000 పరుగుల మైలురాయికి 87 ఇన్సింగ్స్ లను తీసుకుంటే, ద్రావిడ్ 88 ఇన్సింగ్ ల్లో సాధించాడు. కానీ, విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు కేవలం 76 ఇన్సింగ్స్ లు ఆడి 3958 పరుగులు సాధించాడు. అంటే గవాస్కర్, ద్రవిడ్ తో పోలిస్తే కోహ్లీ అత్యంత వేగంగా 4,000 పరుగులు చేసిన క్రికెటర్ గా నిలవనున్నాడు. సెహ్వాగ్ 71 ఇన్నింగ్స్ ల్లో 4,000 పరుగులతో మొదటి స్థానంలో ఉంటే, సచిన్ 78 ఇన్సింగ్స్ ల్లో ఈ రికార్డు సాధించాడు.

  • Loading...

More Telugu News