Bhanu Prakash Reddy: జగన్ కు అనుకూలంగా వ్యవహరించే అధికారులు జైలుకు వెళ్లడం ఖాయం: భానుప్రకాశ్ రెడ్డి
- రాష్ట్రంలో జగన్ రాజ్యాంగం నడుస్తోందన్న భానుప్రకాశ్ రెడ్డి
- కొందరు అఖిల భారత అధికారులు జగన్ తో అంటకాగుతున్నారని విమర్శ
- వాలంటీర్ వ్యవస్థ వైసీపీకి అనుకూలంగా పని చేస్తోందని మండిపాటు
వైసీపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో జగన్ రాజ్యాంగం అమలవుతోందని దుయ్యబట్టారు. బాధ్యత కలిగిన కొందరు అఖిల భారత అధికారులు జగన్ తో అంటకాగుతున్నారని... వీళ్లంతా జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులు కూడా వైసీపీ నేతలు చెప్పినట్టే వింటున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఈ మూడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఎక్కడెక్కడ వినియోగించారో వైసీపీ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ పనితీరును దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. దొంగ ఓట్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.