Rohit Sharma: కీలక మైలురాయి దాటిన రోహిత్ శర్మ

Rohit Sharma becomes 7th India batter to complete 17000 international runs

  • అంతర్జాతీయ క్రికెట్ లో 17 వేల పరుగుల క్లబ్ లో భారత కెప్టెన్
  • ఈ ఘనత సాధించిన భారత ఏడో బ్యాటర్ గా రికార్డు
  • ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 32 పరుగులకు ఔట్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయి చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 17 వేల పరుగుల క్లబ్ లో చేరాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అతను ఈ ఘనత సాధించాడు. 17 వేల పరుగులు చేసిన భారత ఏడో బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. తద్వారా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రీడాకారుల్లో సచిన్ (34, 357)ముందున్నాడు. 

విరాట్ కోహ్లీ (25, 047),  రాహుల్ ద్రవిడ్ (24,064), సౌరవ్ గంగూలీ (18,433), ఎంఎస్ ధోనీ (17,092) ఈ ఘనత సాధించారు. కాగా, శనివారం శుభ్ మన్ గిల్ తో ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ (44 బంతుల్లో 7 ఫోర్లతో 32) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. తొలి వికెట్ కు 74 పరుగులు జోడించిన తర్వాత స్పిన్నర్ కునెమన్ బౌలింగ్ లో లబుషేన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు

  • Loading...

More Telugu News