KCR family: కేసీఆర్ ఫ్యామిలీని మోదీ సర్కారు టార్గెట్ చేసింది.. అసదుద్దీన్ ఒవైసీ ఆరోపణలు

mim mp asaduddin owaisi accused the modi government of targeting kcr family

  • ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
  • బీఆర్ఎస్ కు మద్దతుగా ట్వీట్ చేసిన అసదుద్దీన్
  • తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆరోపణ

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ రోజు హాజరైన విషయం తెలిసిందే. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం విచారణ పేరుతో వేధిస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కవితకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మిత్రపక్షం మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా స్పందించారు. 

తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ స‌ర్కార్ టార్గెట్ చేసిందని అస‌దుద్దీన్ ఆరోపించారు. ‘‘దేశంలోని ముస్లింల‌ను ఆర్థికంగా వెలివేయాల‌ని బీజేపీ ఎంపీలు పిలుపునిచ్చారు. ప్రజ‌లు త‌మ ఇళ్లలో ఆయుధాలు పెట్టుకోవాల‌ని చెప్పారు. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం.. తెలంగాణ స‌మ‌గ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేయడంలో బిజీగా ఉంది’’ అని ఈ రోజు ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News