K Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం... ముగిసిన కవిత విచారణ
- లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు
- ఈడీ నోటీసుల జారీ
- విచారణకు హాజరైన కవిత
- 8 గంటలకు పైగా విచారణ
- ఈ నెల 16న మరోసారి విచారించనున్న ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఈడీ విచారణ ముగిసింది. ఈడీ అధికారులు కవితను 8 గంటలకు పైగా ప్రశ్నించారు. కాగా, కవితను మరోసారి ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించింది. ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలంటూ కవితకు ఈడీ నోటీసులు అందించింది. విచారణ ముగిసిన అనంతరం కవిత... ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి బయల్దేరారు.
కాగా, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల నుంచి ఆయన ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్నారు. కవితపై ఈడీ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ మంత్రులు దేశ రాజధానిలో మకాం వేశారు.