Drunk groom: మద్యం మత్తులో పెండ్లిపీటలపైనే పడుకున్న వరుడు.. పెళ్లి రద్దు చేసుకున్న వధువు! వీడియో ఇదిగో!

Drunk Groom Sleeps At His Wedding viral vedeo

  • అసోంలోని నల్ బరీలో ఈ నెల 7న ఘటన
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన వధువు ఫ్యామిలీ
  • ఏర్పాట్లకు అయిన ఖర్చును ఇప్పించాలని డిమాండ్

పెళ్లి కాబోతోందనే సంతోషంతోనో స్నేహితులు బలవంతపెట్టారనో.. కారణమేంటో కానీ కాసేపట్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు ఫుల్లుగా మద్యం సేవించాడు. తూలుకుంటూ మ్యారేజ్ హాల్ కు చేరుకున్నాడు. అతికష్టమ్మీద పెండ్లి పీటల దాకా చేరుకుని, ఆపై అక్కడే ఆదమరిచి నిద్రించాడు. పెళ్లికొడుకు నిర్వాకం స్వయంగా చూసిన వధువు తనకీ పెళ్లి వద్దంటే వద్దని తేల్చిచెప్పింది. సొంత పెళ్లికి సోయిలేకుండా తాగొచ్చిన వరుడిని పెళ్లాడేదిలేదని స్పష్టం చేసింది. దీంతో పెళ్లి ఆగిపోయింది. అసోంలోని నల్ బరీలో ఈ నెల 7న చోటుచేసుకుందీ ఘటన. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లి ఏర్పాట్ల కోసం తాను వెచ్చించిన సొమ్మును వరుడి తరపువారి నుంచి ఇప్పించాలంటూ వధువు తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.

నల్ బరీకి చెందిన ప్రసేన్ జిత్ హలోయ్ అనే యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. వివాహం గ్రాండ్ గా జరిపించేందుకు ఏర్పాట్లు జరిగాయి. అయితే, ప్రసేన్ తో పాటు ఆయన తండ్రి, ఇతర బంధువులు ఫూటుగా మద్యం సేవించడంతో ఈ కార్యక్రమం కాస్తా రసాభాసాగా మారింది. పెండ్లిపీటలపైన కూర్చోలేక వరుడు అక్కడే పడుకుండిపోయాడు. మద్యం మత్తులో తూగుతున్న వరుడి బంధువుల పరిస్థితి చూసి పెళ్లికి వచ్చిన వారంతా అవాక్కయ్యారు. ఆపై పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోయారు. ఈ నెల 7న నల్ బరీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Loading...

More Telugu News