The Elephant Whisperers: ఆస్కార్స్‌లో భారత్ బోణీ.. ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’కు బెస్ట్ షార్ట్‌ఫిల్మ్ పురస్కారం

The Elephant Whisperers Wins Best Documentary Short film In Oscars

  • ‘నాటునాటు’ పాటను పరిచయం చేసిన బాలీవుడ్ నటి దీపిక
  • ఉత్తమ యానిమేటెడ్ సినిమాగా ‘ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్’
  •  మరో భారతీయ డాాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ‘ఆల్ దట్ బ్రీత్స్’కు నిరాశ

ఆస్కార్ అవార్డ్స్‌లో భారత్ బోణీ కొట్టింది. బెస్ట్ షార్ట్‌ఫిల్మ్ విభాగంలో భారత్‌కు ఆస్కార్ దక్కింది. డాక్యుమెంటరీ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’కు ఆస్కార్ పురస్కారం దక్కింది. ఈ సినిమాకు కార్తీకీ గోన్‌సాల్వెస్ దర్శకత్వం వహించగా, గునీత్ మోంగా నిర్మించారు. 

‘ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్’ సినిమాకు ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు లభించింది. చార్లీ మెక్సీ, మాథ్యూ ఫ్రూడ్‌ దీనిని రూపొందించారు. 

ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకుణే ‘నాటునాటు’ పాటను పరిచయం చేసి పాట నేపథ్యాన్ని వివరించారు. గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లైవ్‌లో ఈ పాట పాడగా అమెరికన్ డ్యాన్సర్స్ అద్భుతంగా  డ్యాన్స్ చేసి అదరగొట్టారు. ఇక, ఆస్కార్ బరిలో నిలిచిన భారతీయ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ‘ఆల్ దట్ బ్రీత్స్’కు నిరాశే ఎదురైంది. ఈ సినిమా తుది జాబితాలో చోటు దక్కించుకున్నప్పటికీ ‘నవానీ’ ముందు నిలవలేకపోయింది. ‘బ్లాక్ పాంథర్: వకండా ఫరెవర్’ సినిమాకుగాను ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు లభించింది. రూత్ కార్టర్ అవార్డు అందుకున్నారు.

  • Loading...

More Telugu News