railway station: చెస్ బోర్డ్ మాదిరిగా కనిపించే రైల్వే స్టేషన్ ఇది..!

Did you know that this railway station in India resembles a chessboard Railway Ministry shares pic

  • ఉత్తరప్రదేశ్ లోని లక్నో రైల్వే స్టేషన్ విశిష్టత 
  • పై నుంచి చూస్తే చెస్ బోర్డ్ రూపంలో రైల్వే స్టేషన్
  • చెస్ పీసులుగా స్టేషన్ డోమ్, పిల్లర్లు
  • ట్విట్టర్ లో ప్రకటించిన రైల్వే శాఖ

చార్ బాగ్. ఇది ఉత్తర భారతంలో ఒక ప్రధాన రైల్వే స్టేషన్, ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఉంది. నిర్మాణ శైలి పరంగా, చారిత్రకంగా ఈ రైల్వే ష్టేషన్ కు ఎంతో ఆకర్షణ ఉంది. ఈ స్టేషన్ గురించి ఆసక్తికర సమాచారాన్ని భారతీయ రైల్వే విభాగం ట్విట్టర్ లో షేర్ చేసింది.

‘‘మీకు తెలుసా? నవాబుల పట్టణం లక్నో రైల్వే స్టేషన్, చార్ బాగ్ లో ఉన్నది. అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో పై నుంచి చూస్తే చెస్ బోర్డ్ మాదిరిగా కనిపిస్తుంది’’ అని రైల్వే శాఖ పేర్కొంది. స్టేషన్ డోమ్స్, పిల్లర్లు చెస్ పీసులు మాదిరిగా ఉంటాయని, ఎంతో వినూత్నమైన నిర్మాణ శైలితో ఎంతో మంది సందర్శకులను ఆకర్షిస్తోందని పేర్కొంది.

దీనికి నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. ‘‘టూరిస్టులను పైకి తీసుకెళ్లి చూపిస్తారా? నేలపై నుంచి చూస్తే ఏమీ కనిపించదు’’ అని ఓ యూజర్ తన అసహనం వ్యక్తం చేశారు. ఈ ఆర్కిటెక్చర్ అద్భుతాన్ని తప్పనిసరిగా ఒక్కసారైనా చూడాలని మరో యూజర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News