Ntr: ప్రేమ్ రక్షిత్ గ్రాఫ్ ను అమాంతంగా పెంచేసిన 'నాటు నాటు' సాంగ్!
- ఆస్కార్ వేదికపై 'ఆర్ ఆర్ ఆర్ ' సందడి
- 'నాటు నాటు' పాటకి దక్కిన గౌరవం
- సమష్టి కృషితోనే సాధ్యమైన సక్సెస్
- సంబరాలు జరుపుకుంటున్న ఫ్యాన్స్
ప్రేమ్ రక్షిత్ .. కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి 2005లో 'ఛత్రపతి' సినిమాతో అడుగుపెట్టాడు. ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన ఆయన డాన్స్ ను ఒక తపస్సుగా భావిస్తూ ఎదుగుతూ వచ్చాడు. కెరియర్ ఆరంభంలోనే బన్నీ .. ఎన్టీఆర్ .. చరణ్ వంటి హీరోల దృష్టిలో పడ్డాడు. బెస్ట్ కొరియోగ్రాఫర్ గా అనేక అవార్డులను అందుకున్నాడు. ఆ సినిమాల్లో 'మగధీర'..'బాహుబలి' వంటి సినిమాలు కూడా ఉన్నాయి.
ఈ కారణంగానే ఆయన రాజమౌళి నుంచి మరింత నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. అందువల్లనే 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో అవకాశాన్ని అందుకున్నాడు. ఎన్టీఆర్ - చరణ్ ఇద్దరూ కూడా స్టెప్పులు అదరగొట్టేసేవారే. గతంలో ఈ ఇద్దరితోను ప్రేమ్ రక్షిత్ పనిచేయడం వలన, ఆ ఇద్దరూ కలిసి చేసే డాన్స్ ఎలా ఉండాలనే విషయంలో ఆయనకి ఒక క్లారిటీ ఉంది. అందువల్లనే ఈ పాటను ఆయన అద్భుతంగా కంపోజ్ చేయగలిగాడు. ఈ పాట ఆస్కార్ వేదికపై మెరవడంలో తనవంతు పాత్రను పోషించాడు.
నిజానికి 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాటను కంపోజ్ చేయడం చాలా కష్టమైన విషయం. ఆ పాటకు డాన్స్ చేయడానికి కూడా ఎంతో ఎనర్జీ అవసరమవుతుంది. ఆ పాట .. అదివచ్చే సందర్భం .. కష్టతరమైన స్టెప్స్ .. చంద్రబోస్ సాహిత్యం .. కీరవాణి సాహిత్యం .. రాహుల్ - కాలభైరవ గానం .. ఇలా అన్నీ కుదరడం వల్లనే ఈ రోజున ఈ పాట ఆస్కార్ వేదికపై రెపరెపలాడుతోంది. ఒక కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ గ్రాఫ్ ను ఈ పాట అమాంతంగా పెంచేస్తుందని చెప్పచ్చు.