Anand Mahindra: నాటు నాటు పాటను ఆస్కార్ వరించడంపై ఆనంద్ మహీంద్రా స్పందన

Anand Mahindra opines on Naatu Naatu song getting Oscar
  • ఆస్కార్ లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్
  • నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు
  • ఆ పాట ఓ సినీ అద్భుతమన్న ఆనంద్ మహీంద్రా
  • చిత్రబృందానికి శిరసు వంచి వందనం చేస్తున్నానని వెల్లడి
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎంఎం కీరవాణి స్వరపరిచిన నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సాధించడం పట్ల ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. బలం, ఆశావాదం, భాగస్వామ్యం, విమర్శలకు ఎదురొడ్డి గెలిచిన వైనం... ఇవన్నీ కలగలిసినదే నాటు నాటు పాట అని వివరించారు. 

"నాటు నాటు కేవలం ఓ పాట మాత్రమే కాదు... అదే ఒక చిన్న సినీ అద్భుతం వంటిది. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఆ పాటకు స్టెప్పులు వేయడంలో ఆశ్చర్యమేమీ లేదు... చివరికి ఆస్కార్ లోనూ నాటు నాటు పాటను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళికి, ఎంఎం కీరవాణికి, చంద్రబోస్ కు శిరసు వంచి వినమ్రంగా నమస్కరిస్తున్నాను" అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
Anand Mahindra
Naatu Naatu
RRR
Oscar
Rajamouli
Keeravani
Chandrabose

More Telugu News