CPI Narayana: ఆ అధికారుల వేళ్లు నరికేయాలి.. అప్పుడే మరోమారు తప్పుచేయకుండా ఉంటారు: సీపీఐ నారాయణ
- శాసన మండలి ఎన్నికలపై స్పందించిన నారాయణ
- పదో తరగతి కూడా చదువుకోని వారికి డిగ్రీ పాసైనట్టు ధ్రువపత్రాలు ఇచ్చారన్న నేత
- ఒక్క నియోజకవర్గంలోనే 15 వేల దొంగ ఓట్లు లెక్కతేలాయన్న నారాయణ
ఆంధ్రప్రదేశ్‌లో నిన్న జరిగిన శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రులు కాని వారు కూడా పెద్ద ఎత్తున ఓటేసినట్టు వస్తున్న వార్తలపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నిన్న ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి చదువుకోని వాళ్లకు కూడా డిగ్రీ పాసైనట్టు నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చారని, అలాంటి అధికారుల వేళ్లు నరికినా తప్పులేదని అన్నారు. అలా చేస్తేనే ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా ఉంటారని అన్నారు.
ఏపీ శాసన మండలి ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో ప్రజలు గమనించాలని సూచించారు. ఒక్క నియోజకవర్గంలోనే 15 వేల దొంగనోట్లు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. నకిలీ ధ్రువపత్రాల కోసం ప్రత్యేకంగా ప్రింటింగ్ మిషన్లు కూడా ఏర్పాటు చేసుకున్నారని నారాయణ ఆరోపించారు.