LV Subrahmanyam: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లకు ఆధారాలు ఉన్నా మీరేం చేస్తున్నారు?: ఈసీకి మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం లేఖ

LV Subrahmanyam letter to SEC on fake votes in MLC elections

  • ఏపీలో నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు
  • బోగస్ ఓట్లకు తిరుగులేని ఆధారాలున్నాయన్న ఎల్వీ సుబ్రహ్యణ్యం
  • కళ్ల ముందు ఆధారాలు కనిపిస్తున్నా మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్న

ఏపీలో నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తీరును విమర్శిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఒక ప్రహసనంగా ముగిసిందని విమర్శించారు. బోగస్ ఓట్లను నమోదు చేస్తున్నట్టు ఎన్నో తిరుగులేని ఆధారాలు కనిపిస్తున్నా చర్యలు తీసుకోకుండా మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. కళ్ల ముందు అక్రమాలు కనిపిస్తున్నా మౌనంగా ఎలా ఉన్నారని అడిగారు. 

ఐదు, పదో తరగతి చదివిన వారిని కూడా పట్టభద్రులుగా బోగస్ ఓటర్లను సృష్టించారని అన్నారు. బోగస్ ఓట్లు, ఎన్నికల నిర్వహణ అవకతవకలపై తక్షణమే విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రీపోల్ కు ఆదేశించే అవకాశం కూడా ఉందని చెప్పారు. ఈ మేరకు ఎస్ఈసీ ముకేశ్ కుమార్ మీనాకు ఎల్వీ సుబ్రహ్మణ్యం లేఖ రాశారు. 

  • Loading...

More Telugu News