NIA Court: జగన్ పై కోడికత్తితో దాడి కేసు... కీలక ఆదేశాలు జారీ చేసిన ఎన్ఐఏ కోర్టు

NIA Court orders CM Jagan to appear in attack case

  • గత ఎన్నికల సమయంలో జగన్ పై కోడికత్తితో దాడి
  • విశాఖ ఎయిర్ పోర్టులో ఘటన
  • నేడు ఎన్ఐఏ కోర్టులో విచారణ
  • ఏప్రిల్ 10న విచారణకు రావాలంటూ సీఎం జగన్ కు ఆదేశం

గత ఎన్నికల వేళ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి జరగడం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 10వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ సీఎం జగన్ ను ఆదేశించింది. సీఎంతో పాటు ఆయన పీఏ నాగేశ్వరరెడ్డి కూడా విచారణకు రావాలని స్పష్టం చేసింది. 

నేడు, ఎయిర్ పోర్టు అథారిటీ కమాండర్ దినేశ్ ను న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా పోలీసులు కోడికత్తిని, మరో చిన్న కత్తిని కోర్టుకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించిన ఓ సెల్ ఫోన్, పర్సును కూడా ఎన్ఐఏ ధర్మాసనానికి అందించారు. అనంతరం, తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News