AP Cabinet: ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు ఇవే!
- సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం
- క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి వేణుగోపాలకృష్ణ
- ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి ఏపీ క్యాబినెట్ అభినందనలు
- కమిషన్ చైర్మన్ల పదవీకాలం కుదింపునకు ఆమోదం
- షెడ్యూల్డ్ కులాల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
ఇవాళ సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వివరాలు తెలిపారు. 'నాటు నాటు' పాటకు గాను ఆస్కార్ అవార్డు దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి ఏపీ క్యాబినెట్ అభినందనలు తెలిపిందని వెల్లడించారు.
షెడ్యూల్డ్ కులాల చట్ట సవరణ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. వివిధ కమిషన్ల చైర్మన్ల పదవీకాలం కుదింపు చట్టసవరణకు ఆమోదించినట్టు తెలిపారు. బీసీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా కమిషన్ చైర్మన్ల పదవీకాలం రెండేళ్లకు కుదించాలన్న నిర్ణయానికి ఆమోదం లభించినట్టు వెల్లడించారు.
ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనల సవరణకు, ఏపీ పబ్లిక్ లైబ్రరీ చట్ట సవరణకు ఆమోదం తెలిపినట్టు మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ఎడ్యుకేషన్ ఆర్డినెన్స్ ప్రతిపాదనకు ఆమోదించినట్టు వివరించారు.