JP Nadda: పోర్టుబ్లెయిర్ లో టీడీపీ-బీజేపీ కూటమి విజయం పట్ల జేపీ నడ్డా స్పందన
- పోర్టుబ్లెయిర్ మున్సిపల్ చైర్ పర్సన్ టీడీపీ అభ్యర్థి
- బలపరిచిన బీజేపీ
- కృషి, అంకితభావానికి తగిన ఫలితం లభించిందన్న నడ్డా
అండమాన్ నికోబార్ లోని పోర్టుబ్లెయిర్ లో టీడీపీ-బీజేపీ కూటమికే మరోసారి మున్సిపల్ చైర్ పర్సన్ పదవి దక్కడం తెలిసిందే. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. పోర్టుబ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు బీజేపీ-టీడీపీ కూటమిని అభినందిస్తున్నానని తెలిపారు. పోర్టుబ్లెయిర్ ప్రజల సంక్షేమం కోసం మీ కృషి, అంకితభావం తగిన ఫలితాన్ని ఇచ్చాయని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్ పై ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఇది గీటురాయి వంటిదని జేపీ నడ్డా పేర్కొన్నారు.