Jr NTR: హైదరాబాద్ చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఏమన్నాడంటే?.. వీడియో ఇదిగో!
- ఈ ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండైన ఎన్టీఆర్, ప్రేమ్ రక్షిత్
- అభిమానుల ఘన స్వాగతం
- మద్దతు పలికిన ప్రతి భారతీయుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్న ఎన్టీఆర్
- అభిమానులతో విమానాశ్రయం కిటకిట
ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కోసం అమెరికాలోని లాస్ ఏంజెలెస్ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’ పాట అకాడమీ అవార్డు సొంతం చేసుకోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమతోపాటు యావత్ భారతదేశం పులకించి పోయింది. హైదరాబాద్ చేరుకున్న ఎన్టీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. అభిమానుల కోలాహలంతో శంషాబాద్ విమానాశ్రయం రద్దీగా మారింది.
విమానాశ్రయం బయట ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ వచ్చినందుకు గర్వంగా ఉందన్నాడు. తమకు సపోర్ట్ చేసిన ప్రతి భారతీయుడికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నట్టు చెప్పారు. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కూడా ట్రిపుల్ ఆర్ సినిమాను ప్రేమించి ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
దేశంలోనే తొలిసారి
ఆస్కార్‌కు నామినేట్ కావడంతోనే సంచలనం సృష్టించిన ‘నాటుపాటు’ పాట ఆ తర్వాత బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. ఓ పాటకు ఆస్కార్ రావడం దేశ చలనచిత్ర పరిశ్రమలో ఇదే తొలిసారి. ఆస్కార్ అవార్డుల ప్రదానం సందర్భంగా ఈ పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.