Balakrishna: నేను చిటికేస్తే, మూడో కన్నుతెరిస్తే.. జాగ్రత్త అంటూ వైసీపీ ఎమ్మెల్యేకు బాలకృష్ణ వార్నింగ్

Balakrishna warns YCP mla

  • నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై పరోక్షంగా 
    బాలయ్య వ్యాఖ్యలు
  • ఓ వేడుకలో తన సినిమా పాట వేశారనే కారణంతో వైసీపీ కార్యకర్తను ఇబ్బంది పెట్టారన్న బాలకృష్ణ
  • సినిమాను సినిమాగానే చూడాలని హితవు

నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా పాటలకు రాజకీయాలను ఆపాదించడం ఏంటని మండిపడ్డారు. బాలయ్య సినిమా పాటను ఒక వేడుకలో వేశారనే కారణంతో స్థానిక వైసీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డిని గోపిరెడ్డి ఇబ్బంది పెట్టారన్న వార్తలు వచ్చాయి. దాంతో, భాస్కర్ రెడ్డి.. ఎమ్మెల్యే ఇంటిముందు ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం తెలిసిన బాలకృష్ణ.. ఎమ్మెల్యే పేరు చెప్పకుండానే ఆయనపై ఆగ్రహించారు. సినిమాను సినిమాగానే చూడాలన్నారు. ఇంకోసారి ఇలాంటి ఘటన జరిగితే ఊరుకోనని ఓ కార్యక్రమంలో చెప్పారు.

 ‘మొన్న నరసరావు పేటలో చిన్న సంఘటన జరిగింది. బాలకృష్ణ పాట వేశారంటూ వాళ్ల కార్యకర్తనే ఇబ్బంది పెట్టారు. అంతకంటే మూర్ఖుడు ఇంకెవరైనా ఉంటారా. యథా రాజ తథా ప్రజా. స్థాయి దిగజార్చుకున్న ఆ వ్యక్తి పేరు నేను తీయను. ఇంకోసారి ఇలాంటిది జరిగితే మాత్రం ఊరుకోను. నేను చిటికేస్తే, మూడో కన్నుతెరిచానంటే చూస్కోండి జాగ్రత్త. రాజకీయ నాయకుడిగా నాపైకి వస్తానంటే రండి. నేను రెడీ. కానీ, సినిమాల విషయానికి రావొద్దు. మీ పరిధిలో మీరు ఉండండి’ అని బాలకృష్ణ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News