Somu Veerraju: పొత్తులపై పవన్ వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందన

Pawan Kalyan not spoken about alliance with TDP says Somu Veerraju
  • టీడీపీతో పొత్తు గురించి పవన్ మాట్లాడలేదన్న సోము వీర్రాజు
  • పవన్ క్లారిటీ ఇచ్చిన తర్వాత మాట్లాడతామని వ్యాఖ్య
  • ఉత్తరాంధ్రకు జగన్ చేసిందేమీ లేదని విమర్శ
నిన్న మచిలీపట్నంలో జరిగిన జనసేన 10వ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీతో ఉంటే జనసేనకు ముస్లింలు దూరమవుతారని కొందరు అంటున్నారని... ముస్లింలకు ఇష్టంలేకపోతే బీజేపీకి తాను దూరమవుతానని చెప్పారు. ఒకవేళ బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు వారిపై ఎక్కడైనా దాడి జరిగితే పొత్తు నుంచి బయటకు వస్తానని తెలిపారు. 

ఈ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ... టీడీపీతో జనసేన పొత్తు గురించి పవన్ కల్యాణ్ మాట్లాడలేదని అన్నారు. టీడీపీతో పొత్తుపై పవన్ క్లారిటీ ఇచ్చిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడతామని చెప్పారు. ఇక నాలుగేళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు జగన్ చేసిందేమీ లేదని వీర్రాజు విమర్శించారు. విశాఖ రాజధాని అని చెపుతూ ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులతో ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసిందని చెప్పారు. 

Somu Veerraju
BJP
Pawan Kalyan
Janasena
Telugudesam

More Telugu News