Gudivada Amarnath: పవన్ ది కమ్మ జనసేన: గుడివాడ అమర్ నాథ్
- ఏ ఉద్దేశంతో సభను పెట్టారో పవన్ కే తెలియదన్న అమర్ నాథ్
- జనసేనకు రాజకీయ సిద్ధాంతం లేదని విమర్శ
- కాపు కులం మొత్తం జగన్ వైపే ఉందన్న కరణం ధర్మశ్రీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ విమర్శలు గుప్పించారు. ఏ ఉద్దేశంతో నిన్న సభను పెట్టారో పవన్ కే తెలియదని ఎద్దేవా చేశారు. జెండా పవన్ ది... అజెండా తెలుగుదేశం పార్టీదని విమర్శించారు. పవన్ ది కాపు జనసేన కాదని... కమ్మ జనసేన అని అన్నారు. 175కి 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం పవన్ కు లేదని చెప్పారు. జనసేనకు రాజకీయ సిద్ధాంతం లేదని అన్నారు.
వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ పవర్ స్టారా? లేక ఫ్లవర్ స్టారా? అని ఎద్దేవా చేశారు. జనసేన ఒక తొత్తుల పార్టీ అని విమర్శించారు. కాపు కులం మొత్తం ముఖ్యమంత్రి జగన్ వైపే ఉందని చెప్పారు.