Andhra Pradesh: ఏపీ బడ్జెట్ 2,79,279 కోట్లు
- సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ
- సాధారణ బడ్జెట్ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
- అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన
- అన్ని వర్గాల సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపొందించినట్లు వెల్లడి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం ఉదయం బడ్జెట్ పద్దును ప్రవేశపెట్టారు. ఈ ఏడాది రూ.2,79,279 కోట్ల భారీ బడ్జెట్ ను వైసీపీ సర్కారు ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో మంత్రి బుగ్గన బడ్జెట్ పై ప్రసంగిస్తున్నారు. ఈ బడ్జెట్ లో వివిధ శాఖలు, సంక్షేమ పథకాలకు జరిపిన కేటాయింపులను మంత్రి వివరిస్తున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది.
2023-24 సాధారణ బడ్జెట్ పై చర్చించి ఆమోదం తెలిపింది. దీంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ముందుగా శాసనసభలో మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ , కుతూహలమ్మ, పాతపాటి సర్రాజుతో పాటు మరో ముగ్గురు సభ్యుల మృతి పట్ల సభ సంతాపం తెలిపింది. అనంతరం బడ్జెట్ పద్దును ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన.. బడ్జెట్ పై ప్రసంగిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు మంత్రి వివరించారు.