USA: అమెరికా రక్షణ శాఖలో భారత సంతతి వ్యక్తికి కీలక బాధ్యత

Indian American Ravi Chaudhary to be the new Assistant Secretary of US Air Force

  • ఎయిర్‌ఫోర్స్ అసిస్టెంట్ సెక్రెటరీగా రవి చౌదరి
  • రవి నియామకానికి అమెరికా సెనెట్ గ్రీన్ సిగ్నల్
  • 65-29 మెజారిటీతో నామినేషన్‌కు మద్దతు

అమెరికా ప్రభుత్వంలో భారతీయుల ప్రాధాన్యం అంతకంతకూ పెరుగుతుతోంది. తాజాగా భారత సంతతికి చెందిన రవి చౌదరిని ఎయిర్‌ ఫోర్స్‌కు అసిస్టెంట్ సెక్రెటరీ ఆఫ్ డిఫెన్స్‌గా నియమించాలన్న ప్రతిపాదనకు అమెరికా పెద్దల సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రవి ఎంపికకు సంబంధించిన ప్రతిపాదనకు సెనెట్ 65-29 ఓట్ల తేడాతో మద్దతు పలికింది. రవికి అనుకూలంగా ఓటేసిన వారిలో డజను మందికి పైగా ప్రతిపక్ష రిపబ్లికన్ సభ్యులు ఉండటం గమనార్హం. 

రవి చౌదరి 1993-2015 మధ్య అమెరికా ఎయిర్‌ఫోర్స్‌‌లో సీ-17 విమాన పైలట్‌గా వివిధ రకాల మిషన్లలో పాల్గొన్నారు. ప్రస్తుతం విస్తృతంగా వినియోగంలో వున్న జీపీఎస్ ఏర్పాటులోనూ కీలకంగా వ్యవహరించారు. ఆ తరువాత అమెరికా రవాణా శాఖలో సీనియర్ అధికారిగా పనిచేశారు. అమెరికా విమానయాన శాఖ ఫెడరల్ ఏవియేషన్‌లోనూ సేవలందించారు. ఆ శాఖకు సంబంధించి అధునాతన పరిశోధన కార్యక్రమాలకు సంబంధించిన విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు.

USA
  • Loading...

More Telugu News