Stock Market: ఐదు రోజుల నష్టాల తర్వాత లాభాల్లోకి మళ్లిన స్టాక్ మార్కెట్లు
- 79 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 13 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- రెండున్నర శాతం వరకు లాభపడ్డ నెస్లే ఇండియా షేర్ విలువ
ఐదు రోజుల వరుస నష్టాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. చివరకు ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 79 పాయింట్లు లాభపడి 57,635కి పెరిగింది. నిఫ్టీ 13 పాయింట్లు పెరిగి 16,985 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (2.54%), ఏసియన్ పెయింట్స్ (2.32%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.27%), టైటాన్ (2.21%), సన్ ఫార్మా (1.84%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-3.31%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.31%), భారతి ఎయిర్ టెల్ (-0.98%), ఇన్ఫోసిస్ (-0.93%), విప్రో (-0.81%).