Nikhat zareen: ప్రపంచ బాక్సింగ్​ చాంపియన్​షిప్​లో హైదరాబాదీ నిఖత్​ జరీన్​ తొలి పంచ్ అదుర్స్

Nikhat starts IBA Womens World Boxing Championships with a bang

  • గతేడాది ఇదే టోర్నమెంట్ లో స్వర్ణం నెగ్గిన నిఖత్
  • ఢిల్లీలో గురువారం మొదలైన తాజా ఎడిషన్
  • తొలి రౌండ్ లో అద్భుత విజయం సాధించిన నిఖత్

గతేడాది ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం నెగ్గిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ క్రీడా ప్రపంచం దృష్టిని తనవైపునకు తిప్పుకుంది. ప్రపంచ చాంపియన్ అయిన తొలి తెలుగు బాక్సర్ గా నిలిచిన ఆమె ఇప్పుడు తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకునే పనిలో ఉంది. స్వదేశంలో తాజా ఎడిషన్ ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఫేవరెట్ గా బరిలో దిగింది. ఢిల్లీలో గురువారం మొదలైన ఈ టోర్నీలో నిఖత్ అంచనాలను అందుకుంది.

తొలి రౌండ్ లోనే తన పంచ్ పవర్ చూపెట్టింది. డిఫెండింగ్ చాంపియన్‌ నిఖత్ జరీన్‌ (50 కేజీ) తొలి రౌండ్‌లో అజర్‌ బైజాన్‌కు చెందిన అనఖనిమ్‌ ఇస్మాయిలోవాను చిత్తు చేసి తన టైటిల్ వేటను ఆరంభించింది. ఈ బౌట్ లో నిఖత్ జరీన్ పంచ్ ల ధాటికి ప్రత్యర్థి తట్టుకోలేకపోయింది. దాంతో, రెండో రౌండ్ మధ్యలోనే బౌట్ ను నిలిపివేసిన రిఫరీ నిఖత్ ను విజేతగా ప్రకటించాడు. సూపర్ పంచ్ తో హైదరాబాదీ రెండో రౌండ్ లోకి అడుగు పెట్టింది.

  • Loading...

More Telugu News