Graduate MLC Elections: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ హోరాహోరీ
- ఏపీలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
- పట్టభద్రుల ఎమ్మెల్సీల్లో రెండు స్థానాల్లో టీడీపీకి భారీ ఆధిక్యం
- ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో టీడీపీ హవా
- పశ్చిమ రాయలసీమ స్థానంలో వైసీపీ అభ్యర్థి ముందంజ
- ఆరు రౌండ్ల అనంతరం రవీంద్రారెడ్డికి 2,019 ఓట్ల ఆధిక్యం
ఏపీలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ భారీ ఆధిక్యంలో కొనసాగుతుండగా, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ నెలకొంది.
ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి 2,019 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు రవీంద్రారెడ్డికి 56,110 ఓట్లు లభించాయి. అదే సమయంలో, ఈ ఆరు రౌండ్లలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి 54,101 ఓట్లు లభించాయి.
అటు, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ జోరు కనబరుస్తోంది. ఆరు రౌండ్ల తర్వాత కూడా టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం కంచర్ల శ్రీకాంత్ 23,068 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.