Nara Lokesh: లోకేశ్ పాదయాత్రకు 45 రోజులు... ఇప్పటివరకు ఎలా సాగిందంటే...!

Lokesh Yuvagalam 45 days roundup

  • జనవరి 27న ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర
  • చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో యువగళం
  • 577 కిలోమీటర్ల నడక
  • వివిధ వర్గాలను కలుస్తూ, వారికి భరోసా ఇస్తున్న లోకేశ్
  • ప్రతి 100 కిలోమీటర్లకు ఓ ముఖ్యమైన హామీ

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27వ తేదీన కుప్పంలో ప్రారంభించిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 45 రోజుల పాటు 577 కిలోమీటర్ల దూరం కొనసాగిన యువగళం పాదయాత్రకు అడగడుగునా అన్నివర్గాల ప్రజలు నీరాజనాలు పలికారు. 

లోకేశ్ ను కలిసిన వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను ఏకరవుపెట్టారు. ప్రతి ఒక్కరికీ నేనున్నానన్న భరోసా ఇస్తూ లోకేశ్ ముందుకు సాగారు. ఆయనకు రాతపూర్వకంగా 530 విన్నపాలు వివిధ వర్గాల నుంచి అందాయి. మౌఖికంగా వేలాదిమంది తమ బాధలు చెప్పుకున్నారు. 82 ప్రాంతాల్లో వివిధ సంఘాల ప్రతినిధులు తమ వినతులను అందజేశారు. 48 చోట్ల ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతిరోజూ దాదాపు వెయ్యిమంది తమను కలిసేందుకు వస్తున్నప్పటికీ ఓపిగ్గా అందరితో ఫోటోలు దిగుతున్నారు.

లోకేశ్ పై పోలీస్ కేసులు

కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభం మొదలు తంబళ్లపల్లె నియోజకవర్గం వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తంగా 25 పోలీసు కేసులు నమోదయ్యాయి. ఇందులో యువనేత లోకేశ్ పై 3 కేసులు నమోదు చేశారు. ప్రచార రథం, సౌండ్ సిస్టమ్, మైక్, స్టూల్ తో సహా అన్నింటినీ పోలీసులు సీజ్ చేశారు. పీలేరులో బాణాసంచా కాల్చారని కూడా అక్కడి ఇన్ చార్జి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, మరికొందరిపై పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. 

ప్రతి వంద కిలోమీటర్లకు ఓ వరం

యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేశ్ సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రతి వంద కిలోమీటర్ల మజిలీలో ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ... తాము అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో సంబంధిత అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటిస్తున్నారు. పాదయాత్ర 8వ రోజు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో 100 కిలోమీటర్ల మైలురాయి సందర్భంగా బంగారుపాళ్యంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 

16వ రోజు జీడీ నెల్లూరు నియోజకవర్గం కత్తెరపల్లిలో 200 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా, అధికారంలోకి వస్తే జీడీ నెల్లూరులో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 

23వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమానుపురం వద్ద యాత్ర 300 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా, అధికారంలోకి వస్తే 13 గ్రామాలకు తాగునీరందించే రక్షిత మంచినీటి పథకాన్ని చేపడతామని ప్రకటించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 

31వ రోజు 400 కి.మీ చేరుకున్న సంద‌ర్భంగా పాకాల మండ‌లం న‌రేంద్రకుంట మ‌జిలీలో ఆధునిక వ‌స‌తుల‌తో 10 ప‌డ‌క‌ల ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసేందుకు శిలాఫ‌ల‌కం వేశారు. అధికారంలోకి వస్తే న‌రేంద్ర‌కుంటలో పీహెచ్ సీ ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. 

39వ రోజు మదనపల్లి శివారు చినతిప్పసముద్రంలో పాదయాత్ర 500వ రోజుకు చేరుకున్న సందర్భంగా, అధికారంలోకి వస్తే మదనపల్లిలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

పెద్దిరెడ్డి, రోజాలపై లోకేశ్ విమర్శనాస్త్రాలు

గత నాలుగేళ్లలో పెద్దిరెడ్డి కుటుంబం రూ.10 వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిందని లోకేశ్ ప్రజలకు తెలియజెప్పారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు, సత్యవేడు, పుంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాలను పెద్దిరెడ్డి కుటుంబం తమ అక్రమాలకు అడ్డాగా మార్చుకొందని వివరించారు. నగరిలో మంత్రి రోజా, ఆమె సోదరులు, చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సోదరుడు, తిరుపతిలో కరుణాకర్ రెడ్డి, ఆయన పుత్రరత్నం అభినయ్ రెడ్డి, పలమనేరులో ఎమ్మెల్యే వెంకటగౌడ, చిత్తూరులో ఎమ్మెల్యే శ్రీనివాస్ లపైనా లోకేశ్ తన పాదయాత్రలో నిప్పులు చెరిగారు. 

సెల్ఫీ చాలెంజ్ 

నారా లోకేశ్ తమ హయాంలో తెచ్చిన పరిశ్రమల వద్ద సెల్ఫీలు దిగుతూ అధికార పార్టీ నేతలకు చాలెంజ్ విసురుతున్నారు. డిక్సన్, టీసీఎల్, జోహా కంపెనీల వద్ద సెల్ఫీలు దిగి నా హయాంలో తెచ్చిన పరిశ్రమలు ఇవి, మీరు ఏం తెచ్చారో చెప్పాలంటూ ప్రభుత్వానికి చాలెంజ్ చేశారు. 


పాదయాత్రలో లోకేశ్ హామీలు

దళితులకు లోకేశ్ హామీలు

అంబేద్కర్ విదేశీవిద్య, స్టడీసర్కిల్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పునరుద్దరణ.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాల పునరుద్దరణ.

ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు నిధులు, స్వయం ఉపాధికి పెద్దపీట.

దళితులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిన అధికారులపై చర్యలు, తప్పుడు కేసుల ఎత్తివేత.

ముస్లింలకు లోకేశ్ హామీలు 

టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది లో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు.

వక్ఫ్ ఆస్తుల రక్షణ కోసం వక్ఫ్ బోర్డు కి జ్యుడిషియల్ అధికారాలు.

జగన్ ప్రభుత్వం నిలిపేసిన రంజాన్ తోఫా, విదేశీ విద్య, దుల్హన్ పథకాలను తిరిగి ప్రారంభిస్తాం.


బీసీలకు లోకేశ్ హామీలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు వైసీపీ ప్రభుత్వం 24శాతానికి తగ్గించిన రిజర్వేషన్లు మళ్లీ 34 శాతానికి పెంపు

బీసీల రక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో బీసీ రక్షణ చట్టం.

దామాషా పద్దతిలో బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు కేటాయింపు.

బీసీ విద్యార్థులకు విదేశీ విద్య పథకం అమలు.

స్థానిక సంస్థల్లో జగన్ తగ్గించిన 10 శాతం రిజర్వేషన్లు తిరిగి పెంచుతాం.

వడ్డెర్ల వృత్తి పని కోసం క్వారీల కేటాయింపు.

సత్యపాల్ నివేదిక మేరకు వడ్డెరలను ఎస్టీల్లో చేర్చే అవకాశం పరిశీలిస్తాం.

తిరుమలలో రజకులకు బట్టలు ఉతికే కాంట్రాక్ట్. రజకుల దోబీఘాట్లకు ఉచిత విద్యుత్.

కురబల ఆరాధ్యదైవం కనకదాసు జయంతి అధికారికంగా నిర్వహణ.

గొర్రెలు, గొర్రెల కాపరులకు బీమా సౌకర్యం.

నేతన్నకు లోకేశ్ హామీలు

పవర్ లూమ్ కి ఉచితంగా 500 యూనిట్ల ఉచిత విద్యుత్.

చేనేత కార్మికులకు ఉచితంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్.

పట్టణాల్లో చేనేత కార్మికులకు ఉచితంగా టిడ్కో ఇళ్లు, కామన్ వర్కింగ్ షెడ్లు.

గ్రామాల్లో చేనేత కార్మికులకు ఇళ్లు మరియు వర్కింగ్ షెడ్ల నిర్మాణం.

చేనేత వస్త్రాలకు జిఎస్ టి తొలగిస్తాం. రాష్ట్రప్రభుత్వమే జిఎస్ టి భరిస్తుంది.

యువతకు లోకేశ్ హామీలు

చంద్రన్న బీమా రూ.10లక్షలకు పెంపు.

ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహణ

నేరుగా కాలేజీ యాజమాన్యానికి ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఫీజుల చెల్లింపు.

2025 నుండి యేటా జాబ్ కేలండర్ విడుదలతో ఖాళీ పోస్టుల భర్తీ

కేజీ టూ పీజీ ఉచిత బస్ పాస్ సౌకర్యం.

విదేశీ విద్య పథకం తిరిగి ప్రారంభం.

రైతులకు హామీలు

కేంద్రంతో మాట్లాడి నరేగాతో అనుసంధానం.

పంటలకు గిట్టుబాటు ధర

అధికారంలోకొచ్చిన వంద రోజుల్లో టమాటో రైతులకు భారంగా మారిన జాక్ పాట్ విధానం రద్దు.

జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ విధానం పునరుద్ధరణ.

పశుగ్రాసం, ఫీడ్ కు సబ్సీడీ.

గోపాలమిత్రల పునరుద్ధరణ.

మినీ గోకులాల పున:ప్రారంభం.

ప్రమాదాల్లో చనిపోయిన ఆవులు, గేదెలకు ఇన్సూరెన్స్ పై నిర్ణయం.

పాదయాత్రలో ప్రజలకు ఇతర హామీలు

డీకేటీ పట్టాల విషయంలో కర్ణాటక విధానాలు అమలు.

ఆటో యూనియన్ బోర్డు ఏర్పాటు

చంద్రన్న బీమా పున:రుద్ధరణ, బీమా మొత్తం రూ.10లక్షలకు పెంపు.

అన్న క్యాంటీన్ పునరుద్ధరణ

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి నిత్యావసర సరుకుల ధరలు తగ్గింపు

షరతులు లేకుండా ఫించన్లు, రేషన్ కార్డులు మంజూరు.

మహిళలకు హామీలు

మహిళల గొప్పతనం, త్యాగాలను చాటి చెప్పేందుకు కేజీ టు పీజీ విద్యతో పాఠ్యాంశాలు.

ఈశాన్య రాష్ట్రాల తరహాలో మహిళల భద్రతకు ప్రత్యేక విధానాల అమలు.

అభయ హస్తం పథకం పునరుద్ధరణ.

స్థానిక హామీలు

తిరుపతిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ.

మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు, ప్రత్యేక యూనివర్సిటీకి కృషి.

మదనపల్లి టమోటా మార్కెట్ దత్తత.

తిరుపతిలో ముస్లింలకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ కాలేజీ ఏర్పాటు

మామిడి రైతులను ఆదుకునేలా చర్యలు. మార్కెటింగ్ సదుపాయాలు.

పీలేరులో చిరు వ్యాపారస్తులకు మార్కెట్ ఏర్పాటు

APISC ద్వారా పీలేరు, కలికిరిలోని 3000 ఎకరాల భూమిని రిజర్వేషన్ ద్వారా మైనారిటీ, బడుగు బలహీన వర్గాలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు కేటాయింపు.

APNRT పున:నిర్మాణంతో పాటు కేరళ మోడల్ తో స్టాట్యూటరీ పవర్ కల్పన.

అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అప్పగింత

రేణిగుంటలో వణ్యకుల క్షత్రియులకు 5ఎకరాల భూమి.

నీరుగట్టువారిపల్లి చేనేత వస్త్రాలకు బ్రాండింగ్, మార్కెటింగ్ సౌకర్యం.

నీరుగట్టువారిపల్లి చేనేతలకు హౌసింగ్ కం షెడ్స్ ఇళ్లనిర్మాణం. కామన్ వర్క్ షెడ్ల నిర్మాణం.

తంబళ్లపల్లి నియోజకవర్గం బి. కొత్తకోటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు.

**********

  • Loading...

More Telugu News